News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. విజయనగరం జిల్లాలో గెలుపెవరిది.?

image

ఎన్నికల ఫలితాల కోసం విజయనగరం జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.

Similar News

News November 28, 2024

VZM: క్రీడా పోటీలను ప్రారంభించిన DIG

image

విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో వార్షిక జిల్లా పోలీసు స్పోర్ట్స్ గేమ్స్ మీట్ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జెట్టి ముఖ్య అతిథిగా హాజరై, క్రీడా పోటీలను ప్రారంభించారు. పోలీసు ఉద్యోగులు అన్ని రంగాల్లోను ఇతరులకు రోల్ మోడల్‌గా ఉండాలన్నారు. పోలీస్ సిబ్బంది శారీరక ధారుడ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.

News November 28, 2024

గజపతినగరం: శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయుడి మృతి

image

విద్యా వ్యవస్థ బలోపేతానికే శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గజపతినగరం మండలం మరుపల్లి పరిధిలో గల పాలిటెక్నికల్ కళాశాలలో శిక్షణ ఇస్తున్న శ్రీను అనే ఉపాధ్యాయుడు గురువారం గుండెపోటుతో మరణించాడు. ఈ ఉపాధ్యాయుడు శ్రీకాకుళం వాసిగా స్థానిక ఎంఈవో సాయి చక్రధర్ తెలిపారు.

News November 28, 2024

VZM: పవన్ కళ్యాణ్ దృష్టికి ఏనుగుల సమస్య

image

ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగుల సమస్యను డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తీసుకువెళ్లానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఏనుగుల సంచారంతో పంటలు, ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు జీవన భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పవన్‌కు వివరించామన్నారు. ఏనుగుల కదలికలను గుర్తించి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీలో కలిసి కోరినట్లు ఎంపీ తెలిపారు.