News March 30, 2024

నేడే కామారెడ్డిలో అవిశ్వాస తీర్మానం.. తీవ్ర ఉత్కంఠ..!

image

కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ జాహ్నవి పై నేడే అవిశ్వాస పరీక్ష నిర్వహించనున్నారు. FEBలో 27మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌కి అధ్యక్ష పదవిపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ ఫిర్యాదుచేయగా ఈనెల 30న బలపరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అవిశ్వాసం నెగ్గాలంటే 34 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్‌ క్యాంపులో 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఏదేమైనా ఏం జరుగుతుందో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Similar News

News February 28, 2026

నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

image

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.

News February 28, 2026

NZB: సౌందర రాజన్ మృతికి కవిత సంతాపం

image

చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు సౌందర రాజన్ మృతికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ MP కవిత సంతాపం వ్యక్తం చేశారు. సౌందర రాజన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News February 27, 2026

NZB: సిర్పూర్ శివారులో అస్థిపంజరం లభ్యం

image

మోపాల్ మండలం సిర్పూర్ శివారులోని గుట్ట వద్ద ఓ వ్యక్తి అస్థిపంజరం లభ్యమైనట్లు ఎస్సై సుస్మిత శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గుట్ట వద్దకు వెళ్లగా అక్కడ అస్థిపంజరం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టగా మృతదేహం నెల రోజుల క్రితం గల్లంతైన ఈర్ల సాయిలుగా గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.