News April 11, 2025

నేడే డయల్ యువర్ డీఎంలో పాల్గొనండి: జనగామ డీఎం

image

జనగామ ఆర్టీసీ డిపోలో నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని శుక్రవారం ఉ.10 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తున్నామని డీఎం స్వాతి తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘన్పూర్, నర్మెట్ట, తరిగొప్పుల, రఘునాధపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల పరిధిలో గల గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి తమ సమస్యలతో పాటు సూచనలు సలహాలకు 9959226050 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Similar News

News February 23, 2026

కేయూ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 25, 26న నిర్వహించాల్సిన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షల్లో నాన్-ప్రొఫెషనల్ కోర్సులు (MA, MSC, M.com)తో పాటు ప్రొఫెషనల్ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ ఉన్నాయి. ఈ పరీక్షలను మళ్లీ నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

News February 23, 2026

ఏలూరు జిల్లా కలెక్టర్ అసహనం

image

ఏలూరు జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్, ఐసీడీఎస్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ నిర్మాణ పనుల ప్రగతిపై కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఉన్న 45 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, 108 ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పనులను చేపట్టాలని నిర్దేశించారు. అయితే, వీటిలో ఇంకా 22 మరుగుదొడ్లు, 44 తాగునీటి సరఫరా, వాటర్ ట్యాంకుల పనులు కనీసం ప్రారంభించకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.

News February 23, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

కృష్ణా : ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
28న గన్నవరంలో జాబ్ మేళా
పెనమలూరు: ఇంటర్ విద్యార్థి మృతి
కనకదుర్గ వారధి నుంచి గంగూరుకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్
పామర్రు : క్షణకావేశంలో తండ్రిని హతమార్చిన కొడుకు
విజయవాడలో రేపు ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలు
NTR : లంచం అడిగితే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి.!