News April 11, 2025
నేడే డయల్ యువర్ డీఎంలో పాల్గొనండి: జనగామ డీఎం

జనగామ ఆర్టీసీ డిపోలో నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని శుక్రవారం ఉ.10 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తున్నామని డీఎం స్వాతి తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘన్పూర్, నర్మెట్ట, తరిగొప్పుల, రఘునాధపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల పరిధిలో గల గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి తమ సమస్యలతో పాటు సూచనలు సలహాలకు 9959226050 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Similar News
News April 23, 2025
డీఈఈ సెట్ దరఖాస్తులు ప్రారంభం

AP: రెండేళ్ల డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు డీఈఈ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 20న హాల్‌టికెట్లు విడుదలవుతాయి. జూన్ 2, 3వ తేదీల్లో పరీక్ష నిర్వహించి అదే నెల 10న అధికారులు ఫలితాలను ప్రకటిస్తారు.
వెబ్‌సైట్: <
News April 23, 2025
MNCL: RPల నియామకానికి దరఖాస్తులు: DEO

ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిలో సబ్జెక్ట్, జిల్లా రిసోర్స్ పర్సన్స్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు, హెచ్ఎంకు ఈ నెల 24 లోపు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఎంపికైన ఉపాధ్యాయుల వివరాలు 28న ప్రకటిస్తామన్నారు. ఏమనా సందేహాలు ఉంటే క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తిని 8985209588 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
News April 23, 2025
ఇలాంటి దాడి దేశంలోనే తొలిసారి!

టెర్రరిజానికి మతం లేదంటారు. కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది. J&K పహల్‌గామ్‌లో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం దేశంలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మత చిచ్చు రేపి, దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రేరేపిత లష్కర్ ఏ తొయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు.