News April 10, 2025

నేడే తెలంగాణ అమరనాథ్ యాత్ర ప్రారంభం

image

నల్లమలలో వెలసిన సలేశ్వరం జాతర నేటి నుంచి మూడు రోజులు జరగనున్నాయి. తెలంగాణ అమరనాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతర నల్లమల దట్టమైన అడవిలో కొలువై ఉన్నది. ఈ జాతరకు భారీ పోలీస్ బందోబస్తు వందల జరగనున్నాయి జాతులకు అచ్చంపేట నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డీఎం తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు పీఓ సూచించారు.

Similar News

News November 19, 2025

పుట్టపర్తిలో ఐశ్వర్యారాయ్

image

సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా భక్తజన సంద్రమైన ప్రశాంతి నిలయంలో ‘సురంజలి’ పేరుతో సంగీత కార్యక్రమం జరిగింది. అబ్బీ వి, అంతరా నంది ‘సత్యం శివం సుందరం’తో సహా పలు భక్తి గీతాలను ఆలాపించి భక్తుల్ని మైమరపింపజేశారు. బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్, గాయకుడు హరిహరన్, డ్రమ్స్ శివమణి, మాజీ సీజేఐ NV రమణ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

News November 19, 2025

సంగారెడ్డి: వాహనాలు జాగ్రత్తగా నడిపించాలి: ఎస్పీ

image

ఉదయం సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడిపించాలని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు పడుతున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవచ్చని చెప్పారు. ఉదయం సమయంలో సాధ్యమైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొన్నారు. వాహనాల హెడ్ లైట్లు ఇండికేటర్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. కార్లలో వెళ్లేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలన్నారు.

News November 19, 2025

మూవీ ముచ్చట్లు

image

*రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం నుంచి ‘రణ కుంభ’ ఆడియో సాంగ్ విడులైంది.
*‘బాహుబలి ది ఎపిక్’ సినిమా జపాన్‌లో రిలీజ్ కానుందని సమాచారం. డిసెంబర్ 12న విడుదల చేస్తారని, 5న ప్రీమియర్‌కు ప్రభాస్‌, నిర్మాత శోభు యార్లగడ్డ హాజరవుతారని తెలుస్తోంది.
*ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా విజువల్‌గా, మ్యూజికల్‌గా భారీగా ఉండబోతోంది: మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్