News November 22, 2024
నేడే పీఏసీ ఛైర్మన్ ఎన్నిక.. నామినేషన్ వేసిన కృష్ణా జిల్లా ఎమ్మెల్యే
శాసనసభలో శుక్రవారం జరగనున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) ఎన్నికకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య నామినేషన్ వేశారు. కాగా తాతయ్యతో పాటు NDA కూటమి నుంచి మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు నామినేషన్ సమర్పించారు. ఛైర్మన్‌తో పాటు PACలో మొత్తం 9 మంది సభ్యులను నేడు శాసనసభలో స్పీకర్ అయ్యన్న సమక్షంలో సభ్యులు ఎన్నుకుంటారు.
Similar News
News December 8, 2024
ఎన్టీఆర్ జిల్లా: పురుగుల మందు తాగి యువతి సూసైడ్
పురుగుల మందు తాగి యువతి మృతి చెందిన ఘటన జి.కొండూరు మండలం చేగిరెడ్డిపాడులో జరిగింది. గోళ్ల గోపాలరావు, నాగమణి దంపతుల కుమార్తె భాగ్యలక్ష్మి(17) కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. విపరీతమైన కడుపు నొప్పి రావడంతో తట్టుకోలేక పురుగుల మందు తాగింది. వెంటనే గుర్తించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు.
News December 8, 2024
కృష్ణా: బీటెక్ పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) క్యాంపస్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థులకు నిర్వహించే 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 31 నుంచి 2025 జనవరి 8 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని KRU తెలిపింది. సబ్జెక్టువారీగా పరీక్షల టైంటేబుల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
News December 7, 2024
దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలి: VHP
దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలని విశ్వహిందూ పరిషత్(VHP) ప్రతినిధులు సీఎం చంద్రబాబును కోరారు. శనివారం సీఎంను ఆయన నివాసంలో వీరు కలిసి ఈ అంశంపై తయారు చేసిన ముసాయిదా ప్రతిని అందించారు. జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంఖారావం సభ వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దుర్గాప్రసాద రాజు, ప్రధాన కార్యదర్శి మిలింద్, ఉపాధ్యక్షుడు గంగరాజు, గుమ్మళ్ల సత్యం, తదితరులు పాల్గొన్నారు.