News April 9, 2025
నేడే పేట జిల్లా బీజేపీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

నారాయణపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కె. సత్య యాదవ్ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ రానున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు మెట్రో గార్డెన్‌లో ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Similar News
News February 24, 2026
హాల్ టికెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతి: వనపర్తి DIEO

హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తామని వనపర్తి జిల్లా ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి విద్యార్థులు మీసేవ, ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షకు హాజరు కావచ్చని డీఐఈఓ సూచించారు.
News February 24, 2026
రేపే ఇంటర్ పరీక్షలు… సర్వం సిద్ధం

ఈనెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పర్యవేక్షణలో, పరీక్షల నిర్వహణ జరుగుతోందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 అమలులో ఉంటుందనీ, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని అధికారులు సూచిస్తున్నారు.
News February 24, 2026
పరీక్షలా? ఈ శ్లోకాలు చదవండి!

గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్|
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనమ్|| (గణేష్ స్తోత్రం)
సరస్వతి స్తుతి:
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా|
ఓం ప్రణో దేవీ సర్వస్వతీ వాజేభిర్వాజనీ వతీ
దీనా మవిత్రియవతు ఓం శ్రీ సరస్వత్యై నమః||


