News March 19, 2025
నేడే బడ్జెట్.. కొత్తగూడెం జిల్లాకూ కావాలి నిధులు..!

నేడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పెండింగ్లో ఉన్న భద్రాద్రి రామయ్య కేత్రం అభివృద్ధి, సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్, పులుసుబొంత వాగు ప్రాజెక్టు, కొత్తగూడెం బైపాస్ రహదారి, పలు కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం నుంచే ముగ్గురు మంత్రులు ఉండటంతో నిధులు భారీగా కేటాయించాలని కోరుతున్నారు.
Similar News
News November 11, 2025
నటి సాలీ కిర్క్ల్యాండ్ కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్ నటి సాలీ కిర్క్ల్యాండ్(84) కన్నుమూశారు. డిమెన్షియాతో బాధపడుతున్న ఆమె పలుమార్లు కింద పడటంతోపాటు ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల కారణంగా చికిత్స పొందుతూ చనిపోయారు. 1987లో Anna చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆమె ఆస్కార్కు నామినేట్ అయ్యారు. 1968లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాలీ 200కు పైగా చిత్రాలు, టెలివిజన్ సిరీస్లలో నటించారు. గోల్డెన్ గ్లోబ్ సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను సాధించారు.
News November 11, 2025
RBIలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

ఆర్బీఐలో 120 గ్రేడ్-B ఆఫీసర్ పోస్టుల కోసం నిర్వహించిన ఫేజ్-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. <
News November 11, 2025
రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నారా?

AFG క్రికెటర్ రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. NEDలో జరిగిన ఈవెంట్లో రషీద్ ఓ అమ్మాయితో కనిపించగా ఫొటోలు వైరలయ్యాయి. దీనిపై రషీద్ స్పందిస్తూ ‘2025 AUG 2న నా లైఫ్లో కొత్త చాప్టర్ మొదలైంది. ఈవెంట్లో నాతో ఉన్నది నా భార్యే’ అని తెలిపారు. కాగా 2024 OCTలోనూ రషీద్కు మ్యారేజ్ అయినట్లు వార్తలు రావడంతో ఇది రెండో పెళ్లి అని ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.


