News March 19, 2025
నేడే బడ్జెట్.. జనగామ జిల్లాకూ కావాలి నిధులు..!

నేడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జనగామ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న చెన్నూరు రిజర్వాయర్, పాలకుర్తి రిజర్వాయర్, జనగామ మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇండస్ట్రియల్ పార్కులు, పాలకుర్తిలో 100 పడకల ఆసుపత్రితో పాటు పలు కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News April 18, 2025
ADB: విద్యార్థులు SPORTS ట్రైనింగ్‌కి సిద్ధం కండి

సమ్మర్ క్యాంప్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా కలెక్టరేట్ ఛాంబర్‌లో వేసవి శిక్షణ శిబిరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మే 1 నుంచి 31 వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు. 6 నుంచి 14 ఏళ్ల బాలబాలికలు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 18, 2025
మామునూర్: వ్యక్తి సూసైడ్

కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మామునూర్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గుంటూరుపల్లికి చెందిన పెనుముచ్చు శ్రీనివాస్ (45) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. అతడి భార్య శ్వేత చూసి ఇంటి పక్కన ఉన్న వారికి సమాచారం ఇవ్వగా.. అప్పటికే చనిపోయాడు. శ్రీనివాస్ తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News April 18, 2025
వనపర్తి జిల్లాలో వ్యక్తికి జైలు శిక్ష..!

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో గురువారం ఎస్ఐ కే.రాణి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. సంగినేనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి ఆటో నడిపినందుకు ఫస్ట్ అడిషనల్ జడ్జి ఆ వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని కోర్టు పోలీస్ రాజేందర్ తెలిపారు. అలాగే మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి ఫైన్ విధించారన్నారు.