News April 12, 2025
నేడే రిజల్ట్.. నంద్యాల జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. నంద్యాల జిల్లాలో ఫస్టియర్ 15,692 మంది, సెకండియర్ 13,400 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News November 22, 2025
హనుమాన్ చాలీసా భావం – 17

తుమ్హరో మంత్ర విభీషణ మానా | లంకేశ్వర భయె సబ జగ జానా || హనుమంతుడి ఉద్దేశాన్ని పాటించిన విభీషణుడు లంకకు రాజయ్యాడు. ఆయన విజయానికి ఆంజనేయుడి సలహా, ఆశీర్వాదాలు ఎంతో తోడ్పడ్డాయి. ఇలా విభీషనుడిని ఆదుకున్నట్లే హనుమాన్ మనల్ని కూడా ఆదుకుంటాడు. ఎంతో విశ్వాసంతో ఆయన నామాన్ని, మంత్రాన్ని జపిస్తే.. వారిని సత్య మార్గంలో నడిపిస్తాడు. రాముడిని కొలిచేవారికి హనుమంతుని అండదండలు ఎప్పుడూ ఉంటాయని నమ్మకం.<<-se>>#HANUMANCHALISA<<>>
News November 22, 2025
T2OIWC-2026.. ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

భారత్, శ్రీలంక వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగే మెన్స్ T2OIWCలో 20 జట్లు 4 గ్రూపుల్లో పోటీ పడనున్నాయి. ఒక గ్రూపులో ఇండియా, పాక్, USA, నమీబియా, నెదర్లాండ్స్, రెండో గ్రూపులో ఆసీస్, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ ఉంటాయని క్రిక్బజ్ వెల్లడించింది. మూడో గ్రూపులో ఇంగ్లండ్, విండీస్, ఇటలీ, బంగ్లాదేశ్, నేపాల్, నాలుగో గ్రూపులో సౌతాఫ్రికా, కివీస్, అఫ్గాన్, UAE, కెనడా ఉంటాయని తెలిపింది.
News November 22, 2025
HYD: ఐబొమ్మ రవి కేసులో సీఐడీ రంగ ప్రవేశం

ఐబొమ్మ రవి కేసులో తెలంగాణ సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. గేమింగ్, బెట్టింగ్ యాప్లను రవి ప్రమోట్ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించాడు. నాలుగు బెట్టింగ్ యాప్లను రవి ప్రమోషన్ చేశాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర నుంచి సీఐడీ సేకరించింది. రవి ఆర్థిక లావాదేవీలపైనా వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులపై సీఐడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.


