News April 12, 2025
నేడే రిజల్ట్.. సత్యసాయి జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో ఫస్టియర్ 13,083, సెకండియర్ 10,904 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News March 13, 2026
అనంత: ‘బాలుడి హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు’

అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సెట్టూరు మండలం తిప్పనపల్లి గ్రామంలో ఆస్తి తగాదాల వల్ల 2022లో బాలుడిని ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. సెట్టూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.70/2022 u/s 302 r/w 34 IPC సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలుడి హత్య కేసులో ముగ్గురికి (చిట్టప్ప, ఈరన్న, ముకుందప్ప) కఠిన జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
News March 13, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 13, 2026
విశాఖ పోలీసులను అభినందించిన సీఎం

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సైబర్ నేరాలపై విశాఖ పోలీసులు రూపొందించిన 24 షార్ట్ ఫిలింలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రాష్ట్రంలో సైబర్ మోసాలతో రూ.వేల కోట్ల నష్టం జరుగుతున్న నేపథ్యంలో అవగాహన పెంచేందుకు వీటిని రూపొందించినట్లు విశాఖ సీపీ బాగ్చీ వివరించారు. ఈ కృషికి పోలీసులను సీఎం అభినందించారు.


