News March 3, 2025
నేడే MLC ఫలితం.. సర్వత్రా ఉత్కంఠ..!

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. విశాఖ AU ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 20,783 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ప్రధానంగా పోటీలో కూటమి బలపరిచిన రఘువర్మ(APTF),PDF తరఫున విజయగౌరి, PRTU తరుఫున శ్రీనివాసులునాయుడు ఉన్నారు. వీరిలో గురువురులు ఎవరికి పట్టం కట్టారో మరి కొన్ని గంటల్లోనే తేలిపోనుంది.
Similar News
News September 17, 2025
పండగ ఆఫర్ల పేరుతో మోసాలు: ఎస్పీ

పండగ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో ఇచ్చే తప్పుడు ప్రకటనలను నమ్మొద్దని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. తక్కువ ధరకే లభించే వస్తువుల ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల కాల్స్, మెసేజ్లు, ఈమెయిళ్లకు స్పందించవద్దని, సులభంగా డబ్బులు సంపాదించే ఆశతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని కోరారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
News September 17, 2025
కామారెడ్డి: ఇందిరమ్మ ఇండ్లకు రూ.43.21 కోట్లు విడుదల

కామారెడ్డిలో జరిగిన ప్రజా పాలన వేడుకల్లో వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడారు. ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకం అమలులో జిల్లా సాధించిన పురోగతిని వివరించారు. జిల్లాలో మొత్తం 11,621 ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే 6,063 ఇండ్ల నిర్మాణం ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఈ నిర్మాణాల కోసం ఇప్పటి వరకు లబ్ధిదారులకు రూ.43.21 కోట్లు చెల్లించినట్లు వివరించారు.
News September 17, 2025
గోదావరిఖని: గోవాకు ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ

గోదావరిఖని ఆర్టీసీ డిపో నుంచి గోవాకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు గోదావరిఖని బస్టాండ్ నుంచి స్లీపర్ బస్ బయలుదేరుతుంది. ఈ ప్యాకేజీలో మురుడేశ్వర్, గోకర్ణ, గోవా పర్యటనలు ఉంటాయి. ఒక్కరికి ₹7,500 చొప్పున ఛార్జ్ నిర్ణయించారు. నగరానికి 28న తిరిగి చేరుకుంటారని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. రిజర్వేషన్ల కోసం 7013504982, 7382847596 నంబర్లలో సంప్రదించవచ్చు.