News April 9, 2024

నేతన్నల పోరాట ఫలితమే: బండి సంజయ్

image

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం చాలా సంతోషం అని ఎంపీ బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వస్త్ర పరిశ్రమ ఆసాములు, నేతన్నలంతా ఐక్యంగా చేసిన పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఈ విషయంలో నేతన్నలకు అండగా నిలిచిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

Similar News

News December 11, 2025

కరీంనగర్: ఓటింగ్‌కు 18 గుర్తింపు కార్డులు: కలెక్టర్

image

ఓటరు ఐడీ లేకున్నా, 18 రకాల గుర్తింపు కార్డులలో దేనినైనా చూపించి ఓటు వేయవచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, జాబ్ కార్డు, పెన్షన్ పత్రాలు వంటివి అనుమతించబడుతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

News December 11, 2025

KNR: శాతవాహన కామర్స్ కళాశాలలో “ఎత్నిక్ డే”

image

శాతవాహన కామర్స్ కళాశాలలో వార్షిక సాంస్కృతిక కార్యక్రమమైన “ఎథ్నిక్ డే” ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి వీసీ యు. ఉమేష్ కుమార్ తన సతీమణితో సాంప్రదాయ దుస్తులలో హాజరై, కృష్ణాష్టమి ప్రతీకగా ఉట్టి కొట్టి ప్రారంభించారు. అధ్యాపకులు, విద్యార్థులు సాంప్రదాయాలను, జాతి గౌరవాన్ని పెంపొందించే ఆచారాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

News December 10, 2025

KNR: పోలింగ్ కేంద్రాలకు తరలిన పోలింగ్ సిబ్బంది

image

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని 92 గ్రామపంచాయతీలో ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి విడతలో గంగాధర, రామడుగు, కొత్తపల్లి, చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలాలలో ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామగ్రితో పోలింగ్ సిబ్బంది ఆయా గ్రామాల పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు.