News May 2, 2024
నేతలకు గుర్తుల గుబులు
2019 BHNR లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5 వేల ఓట్ల మెజార్టీతో గెలవగా..ఇక్కడ కారును పోలిన రోడ్డు రోలర్ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థికి ఏకంగా 25 వేల ఓట్లు వచ్చాయి. అప్పట్లో బీఆర్ఎస్ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడంతో దాన్ని తొలగించారు. ప్రస్తుతం చపాతి రోలర్, రోడ్డు రోలర్ గుర్తులను కేటాయించారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది.
Similar News
News December 28, 2024
NLG: నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్
ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను నిఘానీడలో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రయోగశాలల్లో సీసీ కెమెరాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, దానికి కావాల్సిన ప్రతిపాదనలను వెంటనే బోర్డుకు పంపాలని ఈ నెల 23న ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 290 ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కళాశాలలో ఫిబ్రవరి మొదటివారం నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి.
News December 28, 2024
NLG: ఫోన్ మాట్లాడుతూ విద్యుత్ తీగలను పట్టుకుని మృతి
ఫోన్ మాట్లాడుతూ విద్యుత్ తీగలను పట్టుకుని యువకుడు మృతి చెందిన ఘటన గుర్రంపోడు మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా.. మక్కపల్లికి చెందిన నేతాళ్ల కిరణ్ (15) బ్రష్ చేసుకుంటూ డాబా ఎక్కాడు. ఫోన్ రావడంతో మాట్లాడుతూ విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కిరణ్ కొండమల్లేపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
News December 28, 2024
నల్గొండ పొలిటికల్ రౌండప్ @2024
కాంగ్రెస్‌కి నల్గొండ 2024లో కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు 11 గెలవడంతో పాటు రెండు ఉత్తమ్, కోమటిరెడ్డికి మంత్రి పదవులు దక్కడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందన్నారు. మరో వైపు BRS SRPT స్థానాన్ని గెలుచుకుని ప్రస్తుతం పట్టుకోసం ప్రయత్నిస్తోందంటున్నారు. రాజకీయంగా ఎదగడానికి బీజేపీ, కమ్యూనిస్టులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. COMMENT