News January 24, 2025

నేత్రపర్వంగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం

image

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం రామయ్య నిత్యకళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకళ్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Similar News

News November 28, 2025

MHBD: భూమి పేరు మార్పిడికి లంచం డిమాండ్

image

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర తహశీల్దార్ మహేందర్ <<18414245>>లంచం<<>> తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. పోచంపల్లి పడమటి తండాకు చెందిన రైతు భూక్య బాలు తండ్రి పేరిట ఉన్న 3.09 గుంటల వ్యవసాయ భూమిని తన పేరు మీదకు మార్చడానికి తహశీల్దార్ రూ.25 వేలు డిమాండ్ చేయగా, రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

News November 28, 2025

నాన్-ఏసీ కోచ్‌ల్లోనూ దుప్పటి, దిండు

image

రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్‌లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.

News November 28, 2025

సిద్దిపేట: గంగాపూ‌ర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

image

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపైకి ద్విచక్ర వాహనం ఎక్కి కిందపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లెకు చెందిన రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.