News March 26, 2025
నేత్రపర్వంగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకళ్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితరపూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మ వారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకళ్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Similar News
News January 5, 2026
తిరుమల: FEB 19 నుంచి విద్వత్ సదస్సు

తిరుమల ధర్మగిరి శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఫిబ్రవరి 19 నుంచి 24 వరకు శ్రీ వేంకటేశ్వర వేద-శాస్త్ర-ఆగమ-విద్వత్ సదస్సు జరగనుంది. ఇందులో వేదాలు, శాస్త్రాలు, ఆగమాలు, పురాణాలు, ఇతిహాసాల తదితర వాటిపై మౌఖిక, లేఖన పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా 21న ప్రతివర్ష పండితులకు వార్షిక సభ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైన్నాయి.
News January 5, 2026
NLG: అమ్మ బాబోయ్.. కేజీ రూ.300లా!

నల్గొండ జిల్లాలో చికెన్ రేటు ట్రిపుల్ సెంచరీ కొట్టింది. కిలో మాంసం రూ.300కి చేరడంతో మాంసం ప్రియులు బెంబేలెత్తుతున్నారు. గుడ్డు ధర రూ.8.50 ఉండగా.. లైవ్ కోడి రూ.185, స్కిన్‌లెస్ రూ.290-310 పలుకుతోంది. బర్డ్ ఫ్లూతో ఉత్పత్తి తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. పండగ పూట ముక్క లేకపోతే ఎలా అని మాంసం ప్రియులు వాపోతుండగా, రేట్లు ఇప్పట్లో దిగిరావని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
News January 5, 2026
NLG: టెట్ అభ్యర్థులకు తప్పని తిప్పలు

టెట్ అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల కేటాయింపు ఇబ్బందిగా మారింది. మొదటి రోజే అప్లై చేసినా, ప్రాధాన్యత క్రమంలోని చివరి పట్టణాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. జిల్లా నుంచి 1,557 మంది ఉపాధ్యాయులతో సహా సుమారు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన పరీక్షలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.


