News January 11, 2025
నేను ఎక్కడికి పారిపోను: చెవిరెడ్డి
న్యాయం తనవైపు ఉందని, తాను ఎక్కడికి పారిపోనని YCP నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఆయనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. ఈ కేసులో పోలీసులు చెప్పిదంతా అబద్ధం అన్న చెవిరెడ్డి.. తనకు సుప్రీంకోర్టులో అయినా న్యాయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకు తాను ఎక్కడికి వెళ్లనని, తన ఫోను కూడా ఆఫ్ చేయనని స్పష్టం చేశారు.
Similar News
News January 18, 2025
CTR: పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో మహిళకు గాయాలు
చిత్తూరు జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఈక్రమంలో ఓ మహిళ గాయపడింది. వెంటనే రిక్రూట్మెంట్ ఇన్‌ఛార్జ్, సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న సంబంధిత సిబ్బంది ద్వారా ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు వాయల్పాడుకు చెందిన షకీలాగా గుర్తించారు. 1600 మీటర్ల పరుగు పందెంలో కాలుజారి కిందపడటంతో గాయపడ్డారు.
News January 18, 2025
తిరుపతి తొక్కిసలాట పిటిషన్‌పై కోర్టు కీలక ఆదేశాలు
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై గవర్నర్ కార్యదర్శి, ముఖ్యమంత్రిని ప్రతివాదులుగా చేర్చుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తొక్కిసలాటకు గవర్నర్ కార్యదర్శి, సీఎం ఎలా బాధ్యులవుతారని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారని.. వెంటనే పిటిషన్‌లో సీఎం, గవర్నర్ కార్యదర్శి పేర్లను తొలగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారం(22వ తేదీ)కి వాయిదా పడింది.
News January 18, 2025
తిరుపతి జిల్లాలో జీతం లేని ఉద్యోగాలు
డీఆర్డీఏ, సీడాప్ ఆధ్వర్యంలో పీఎంఎఫ్ఎంఈ ద్వారా తిరుపతి జిల్లాలో రిసోర్స్ పర్సన్ ఎంపిక చేయనున్నట్లు పీడీ శోభన్ బాబు తెలిపారు. ఏపీ పుడ్ ప్రొసెసింగ్ సొసైటీ ద్వారా మండల స్థాయిలో పని చేసే అవకాశం ఉంటుంది. మైక్రో పుడ్ ప్రోసెసింగ్ ఏర్పాటుతో పాటు మొబిలైజేషన్ చేపట్టాల్సి ఉంటుంది. జీతం ఉండదు. కేవలం ఇన్సెంటివ్‌పై పనిచేయాల్సి ఉంటుంది. ఈనెల 20వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.