News June 19, 2024
నేను ఎవరి భూములను ఆక్రమించుకోలేదు: మాజీ మంత్రి
మాజీమంత్రి పెనమలూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ జోగి రమేశ్‌పై వస్తున్న భూ ఆక్రమణలపై ఆయన స్పందించారు. తనపై భూ అక్రమాల గురించి వచ్చే వార్తలు కేవలం ఎల్లో మీడియా కల్పిస్తున్న కథనాలే అన్నారు. తాను ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదని ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. తనకున్న భూమి కూడా న్యాయపరంగా కొన్నామని తెలిపారు.
Similar News
News September 16, 2024
వైసీపీ 73 ప్రభుత్వ పాఠశాలలను మూసేసింది: ఉమా
NTR: గత వైసీపీ ప్రభుత్వంలో విలీనం పేరుతో 73 ప్రభుత్వ పాఠశాలలను మూసేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. కోట్ల రూపాయల “నాడు- నేడు” నిధులు దారి మళ్లించిన మాజీ సీఎం జగన్, తాడేపల్లి ఖజానా నింపుకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల విధ్వంసం నుంచి ఉజ్వల భవిష్యత్తు వైపు రాష్ట్రంలోని విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే లక్ష్యంతో NDA కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
News September 16, 2024
కృష్ణా: ‘లా’ విద్యార్థులకు అలర్ట్
కృష్ణా వర్శిటీ పరిధిలోని కళాశాలల్లో B.A.LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులేషన్ 2018 & 2023) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. సెప్టెంబర్ 21, 24, 26, 28వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
News September 16, 2024
విజయవాడలో రూ.26 లక్షలు పలికిన లడ్డూ
విజయవాడ నున్న గ్రామంలో శ్రీ సాయి బాలాజీ ఎన్ క్లేవ్ అపార్ట్మెంట్‌లో వినాయకుడిని నెలకొల్పారు. ఈ వేడుకల్లో సింగంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, నక్కా రామ్ బాలాజీ వేడుకల చివరి రోజు స్వామివారి లడ్డూను రూ.26 లక్షలకు సొంతం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో అపార్ట్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి వినాయక చవితి వేడుకలను మరింత వైభోపేతంగా నిర్వహిస్తామన్నారు.