News February 2, 2025
నేను కొడితే మాములుగా ఉండదు.. : KCR

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ తన ప్రసంగాలతో కాంగ్రెస్పై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇంతకాలం మౌనం పాటించిన కేసీఆర్ మొన్న(శుక్రవారం) ఎర్రవల్లి ఫాంహౌస్లో జరిగిన సభలో స్పందించారు. నేను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా. కొడితే మాములుగా కాదు గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు అని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్?
Similar News
News October 27, 2025
ఖమ్మం: పంట కోతలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి

రాబోయే 2 రోజుల పాటు తుపాను ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు పంట కోతలు వాయిదా వేసుకోవాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 100% ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. పంట నష్టం జరగకుండా టార్పాలిన్ కవర్లు సిద్ధం చేయాలని సూచించారు.
News October 27, 2025
ఎస్బీఐలో మరో 3,500 పోస్టుల భర్తీ

నిరుద్యోగులకు SBI గుడ్న్యూస్ చెప్పింది. 3,500 PO పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గత జూన్లో 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించామని, ప్రస్తుతం 541 PO పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయని చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిశోర్ కుమార్ పోలుదాసు చెప్పారు. ఈ FYలోనే మరో 3వేల సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. త్వరలో వీటికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని PTI ఇంటర్వ్యూలో తెలిపారు.
News October 27, 2025
కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న తుఫాన్

మొంథా తుపాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం కాకినాడకు 500 కిలో మీటర్ల దూరంలో ఉంది. మంగళవారం(రేపు) ఉదయం తీవ్ర తుఫానుగా మారి అదే రోజు సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. గంటకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది.


