News February 2, 2025
నేను కొడితే మాములుగా ఉండదు.. : KCR

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ తన ప్రసంగాలతో కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇంతకాలం మౌనం పాటించిన కేసీఆర్ మొన్న(శుక్రవారం) ఎర్రవల్లి ఫాంహౌస్‌లో జరిగిన సభలో స్పందించారు. నేను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా. కొడితే మాములుగా కాదు గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు అని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్?
Similar News
News December 18, 2025
విశాఖ: సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటుకు పరిశీలన చేసిన కమిషనర్

నగరంలోని ముడసర్లోవ, రాడిసన్ బ్లూ హోటల్, సాగర్ నగర్ ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయా ప్రాంతంల్లో పర్యటించి ట్రాక్ పనులపై జీవీఎంసీ ఈఈ, ఇతర అధికారులతో కమిషనర్ చర్చించి సూచనలు చేశారు. అలాగే బీచ్ రోడ్లో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు, మధురవాడలో ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు.
News December 18, 2025
కోరుకొల్లులో సినిమా షూటింగ్ సందడి

పాలకోడేరు మండలం కోరుకొల్లులో గురువారం ‘తెల్ల కాగితం’ సినిమా షూటింగ్ సందడి నెలకొంది. హీరో రోషన్, హీరోయిన్ వైష్ణవిలపై దర్శకుడు రమేష్ పలు సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్‌ను చూసేందుకు గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. చిత్ర విశేషాలు బయటకు రాకుండా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ పేర్కొంది.
News December 18, 2025
భీమిలి ఎమ్మెల్యే గంటాకు రాజాం ఎమ్మెల్యే వినతి

మధురవాడ GVMC కార్యాలయంలో భీమిలి MLA గంటా శ్రీనివాసరావు నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ గ్రీవెన్స్‌లో పాల్గొని ఎమ్మెల్యే గంటాకు వినతిపత్రం అందజేశారు. పీఎం పాలెంలోని తన కాలేజీ సమీపంలో ఉన్న స్మశానం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, దానిని మార్చాలని కోరారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని గంటా అధికారులను ఆదేశించారు.


