News February 2, 2025
నేను కొడితే మాములుగా ఉండదు.. : KCR

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ తన ప్రసంగాలతో కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇంతకాలం మౌనం పాటించిన కేసీఆర్ మొన్న(శుక్రవారం) ఎర్రవల్లి ఫాంహౌస్‌లో జరిగిన సభలో స్పందించారు. నేను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా. కొడితే మాములుగా కాదు గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు అని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్?
Similar News
News February 18, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 18, 2025
ఎల్లారెడ్డిపేట: బస్సు టైర్ పంచర్.. తప్పిన ప్రమాదం

ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామ శివారులోని బస్సు టైర్ పంచర్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అన్నారు. వీర్నపల్లి మండలం వన్‌పల్లి నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు 110మంది ప్రయాణికులతో వెళుతుండగా బస్సు ఒక్క సైడు ఒరిగి ఆగిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సిరిసిల్ల నుంచి వన్ పల్లికి మరికొన్ని బస్సులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News February 18, 2025
నిర్మల్: పీఎం శ్రీ బడులకు నిధులు మంజూరు

పీఎం శ్రీ ద్వారా కేటాయించిన నిధులను విద్యాసంస్థల్లో మౌలిక వసతులను సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో పీఎం శ్రీ నిధుల వినియోగంపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పాఠశాలలకు కేటాయించిన పీఎంశ్రీ నిధులు, ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన వివరాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.