News March 23, 2024

నేను గెలవగానే కేసులు ఎత్తివేయిస్తా: పులపర్తి

image

వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో భీమవరం నియోజవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గెలవగానే జన సైనికుల మీద మత్స్యపురి అల్లర్లలో అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ కొటికలపూడి గోవిందరావు, జడ్పిటిసి గూండా జయప్రకాశ్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 26, 2025

ప.గో: రైతులకు తుఫాను భయం

image

ప.గో జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజానీకం అల్లాడుతోంది. ముఖ్యం తుఫాను భయంతో రైతుల గుండెల్లో గుబులు పట్టుకుంది. పంటలు చేతికొస్తున్న సమయంలో వర్షంతో నష్టం వాటిల్లే అవకాశం ఉందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పల్లపు ప్రాంతాలు, లంక గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.

News October 26, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: RDO

image

మెంథా తుపాను ప్రభావంతో ఈ నెల 27, 28న భారీ వర్షాలు, బలమైన గాలులు సంభవించనున్నట్టు నరసాపురం RDO దాసి రాజు శనివారం సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు.

News October 25, 2025

జిల్లా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు: కలెక్టర్

image

జిల్లా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశామని, 24/7 అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో రెవిన్యూ డివిజనల్ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. తుపాన్ ప్రభావంపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.