News March 23, 2024
నేను గెలవగానే కేసులు ఎత్తివేయిస్తా: పులపర్తి
వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో భీమవరం నియోజవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గెలవగానే జన సైనికుల మీద మత్స్యపురి అల్లర్లలో అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ కొటికలపూడి గోవిందరావు, జడ్పిటిసి గూండా జయప్రకాశ్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 5, 2024
తణుకులో హత్య.. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు?
తణుకులో పాఠశాల ఆవరణలో ఈ నెల 1న జరిగిన హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హత్యకు గురైన కాకర్ల దుర్గారావుతోపాటు నిందితుడు కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో దుర్గారావుపై దాడి చేయడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
News November 5, 2024
ఏలూరు జిల్లాలో 32 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు
వినియోగదారులకు స్థిరమైన ధరలకు నిత్యావసర వస్తువుల సరఫరాకు సంబంధించి ప్రభుత్వం సూచనలను జారీ చేసిందని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి తెలిపారు. కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆయిల్, పప్పుధాన్యాలు, చక్కెర అసోసియేషన్, ఏలూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచనలను అమలు చేయడానికి, జిల్లాలో 32 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.
News November 4, 2024
రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలి: కలెక్టర్
ఏలూరు జిల్లాలో పల్లెపండుగ కార్యక్రమంలో మంజూరుచేసిన రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణ పనుల ప్రగతిపై సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో 213.55 కిలోమీటర్ల మేర 1080 రోడ్ల నిర్మాణ పనులను మంజూరు చేశామన్నారు.