News March 22, 2024

నేను నెల్లూరు బిడ్డనే: విజయసాయి రెడ్డి

image

తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని నెల్లూరు MP అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. ‘నేను ఎక్కడి నుంచో రాలేదు. నేను నెల్లూరు బిడ్డనే. ఇక్కడే పుట్టి ఇక్కడే చదివా. విజయవాడ, విశాఖ, ఢిల్లీ వెళ్లినా నెల్లూరు సమస్యల పరిష్కారానికి కృషి చేశా. ప్రత్యర్థి లాగా ఇండోనేషియా, దుబాయ్‌లో నాకు వ్యాపారాలు లేవు. మాట ప్రకారం నెల్లూరు 47వ డివిజన్‌ స్వర్ణకారులకు 500 షాపులు నిర్మిస్తా’ అని ఆయన హామీ ఇచ్చారు.

Similar News

News November 28, 2025

నెల్లూరు మేయర్‌గా దేవరకొండ సుజాత..?

image

నెల్లూరు నగర మేయర్‌గా దేవరకొండ సుజాతను ఎంపిక చేసేందుకు టీడీపీ సిద్ధం అవుతోన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15లోగా ప్రస్తుత మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. అనేక అంశాలను పరిశీలించి సుజాత పేరును అధిష్ఠానం ఖరారు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి ఈమె పేరును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

News November 28, 2025

నెల్లూరు జిల్లాలో మార్పులు.. మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా.?

image

జిల్లాలో 5 మండలాల డివిజన్ మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కందుకూరు డివిజన్లో ఉన్న కొండాపురం, వరికుంటపాడు మండలాలను కావలి డివిజన్‌లో కలిపేలా నెల్లూరు డివిజన్‌లో ఉన్న కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను తిరుపతి జిల్లా గూడూర్ డివిజన్‌లో కలిపేలా నిర్ణయిస్తూ గెజిట్ విడుదల చేసింది. వీటిపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా తెలుపాలని అధికారులు సూచించారు.

News November 28, 2025

అధికారులందరూ అప్రమత్తంగా ఉండండి: జేసీ

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 29, 30, డిసెంబర్ 1 తేదీలలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే షెల్టర్లను గుర్తించి అవసరమైన మరమ్మతులు వెంటనే చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.