News November 12, 2024
నేను వైసీపీని వీడట్లేదు: MLC రవీంద్రబాబు

వైసీపీని తాను వీడుతున్నట్లు వస్తున్న వార్తలను ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు ఖండించారు. కాకినాడలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీను వీడాల్సిన అవసరం తనకు లేదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని కులాలతోపాటు దళితులకు కూడా పెద్దపీట వేసిన వైసీపీ అధినేత జగన్‌తోనే తన ప్రయాణమని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News July 9, 2025
తూ.గో జిల్లాలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్

రాజమండ్రి జిల్లా ఎస్పీ డి.నరసింహ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్” నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల దూరంలో ఉన్న షాపులు, దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలు, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అమ్మకాలపై పోలీసులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.
News July 8, 2025
ధవలేశ్వరంలో 11 కిలోల గంజాయి స్వాధీనం

ధవళేశ్వరంలో 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ టి.గణేశ్ తెలిపారు. కడియం సీఐ వెంకటేశ్వరరావు, ధవళేశ్వరం ఎస్ఐ హరిబాబు, ఈగల్ టీమ్‌తో కలిసి పీవీఆర్ పీ లేఅవుట్‌లో దాడి చేసి నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తామని సీఐ వెల్లడించారు.
News July 8, 2025
తూ.గో: రేపు దేశవ్యాప్త సమ్మె

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని గోపాలపురం ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బుధవారం దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు సమ్మె పత్రాలను వైద్యులకు అందజేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు.