News March 21, 2024

నేను సీఎం అవ్వాలనుకోవడం లేదు: పొంగులేటి

image

తాను సీఎం అవ్వాలనుకోవడం లేదని, ఆ ఆలోచనే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తానే సీఎం అనడం ఊహాజనితమైన అన్నారు. తాను ఎవరికీ టచ్‌లో లేనని, రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోనన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ సీట్లను గెలుచుకుంటుందని పేర్కొన్నారు.

Similar News

News November 8, 2025

ఖమ్మం: సైబర్ నేరగాళ్లకు 23 నెలల జైలు

image

సైబర్ నేరాలకు పాల్పడిన రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు నిందితులకు ఖమ్మం కోర్టు శిక్ష ఖరారు చేసింది. నిందితులు మహిర్ అజాద్(25), వకీల్(22)పై కేసు నమోదు చేసి, సీపీ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీసులు సాక్ష్యాలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో వారి నేరం నిర్ధారణ కావడంతో న్యాయమూర్తి పి.నాగలక్ష్మి నిందితులకు 23 నెలల 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.

News November 8, 2025

ఖమ్మం: కోతులు, కుక్కలతో బేజారు

image

ఖమ్మం జిల్లాలోని చాలా మండలాల్లో కుక్కలు, కోతుల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముదిగొండ మండలంలో ఈ సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే చిన్నపిల్లలు, మహిళలు గాయపడి ఆసత్రి పాలయ్యారని, రేబిస్ భయంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నట్లు చెప్పారు. పరిస్థితి చేయి దాటి పోకముందే వాటిని నియంత్రించాలని మండల ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. మీ దగ్గర పరిస్థితి ఎలా ఉంది.

News November 7, 2025

ఖమ్మంలో యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఖానాపురం హవేలీ పోలీసుల కథనం ప్రకారం.. గోపాలపురంలోని కశ్మీర్ దాబా ఎదురుగా అర్ధరాత్రి ఓ యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.