News March 26, 2025
నేను BRSలోనే ఉన్నా: గద్వాల MLA

తాను BRS MLAగానే ఉన్నానని గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించారు. కొంత మంది కావాలని తాను కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం చేశారని పేర్కొన్నారు. పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు నోటీసులను అనుసరించి ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. మీడియాలో వచ్చిన కథనాలపై FEB 11న PSలో ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను BRS సభ్యత్వాన్ని వదులుకోలేదని, పిటిషన్ కొట్టివేయాలని కోరారు. BRSలోనే ఉన్నానని KTRకు చెప్పానన్నారు.
Similar News
News December 4, 2025
డెస్క్ వర్క్ చేసే వాళ్లకి ఫ్రోజెన్ షోల్డర్ ముప్పు

నేడు చాలా మందిని వేధిస్తున్న సమస్య ఫ్రోజెన్ షోల్డర్. చేతిని పైకి ఎత్తినా, కాస్త వేగంగా కదిలించినా నొప్పి వస్తుంది. పడిపోవడం, దెబ్బ తగలడం లేదా ఎక్సర్సైజులు చేయడం వల్ల అలా జరిగిందని అనుకుంటారు. డెస్క్‌లో కూర్చుని పనిచేసే వాళ్లకు ఫ్రోజెన్ షోల్డర్ ముప్పు ఎక్కువని సర్వేలో తేలింది. డయాబెటిస్, హైపోథైరాయిడిజం, గుండె జబ్బుల బాధితులకు ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువ. దీనిని అథెసివ్ క్యాప్సులైటిస్ అంటారు.
News December 4, 2025
మెగా పేరెంట్స్ మీటింగ్ విజయవంతం చేయాలి: కలెక్టర్

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు చురుకైన పాత్ర వహించాలని, మెగా పేరెంట్స్ మీటింగ్‌ను ప్రతీ పాఠశాలలో విజయవంతం చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడానికి ఈ సమావేశం కీలకమని ఆమె తెలిపారు. మీటింగ్‌లో చర్చించాల్సిన ప్రధాన అంశాలు ప్రతీ విద్యార్థి విద్యా ప్రగతి, పదో తరగతి 100 రోజుల ప్రణాళిక అమలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ ఉంటుందన్నారు.
News December 4, 2025
ఇవాళ మిస్ అయితే మళ్లీ 2042లోనే!

ఈ ఏడాది ఆఖరి సూపర్ మూన్ మరికొద్దిసేపట్లో ఆవిష్కృతం కానుంది. ఈ రోజు కనిపించే చంద్రుడు 2042 వరకు మళ్లీ ఇంత దగ్గరగా, ఇంత పెద్దగా కనిపించడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. చందమామ భూమికి అత్యంత <<18450358>>సమీప<<>> పాయింట్‌కు రావడం వల్ల ఇది ‘లార్జెస్ట్ మూన్’గా దర్శనమివ్వనుంది. ఈ అరుదైన ప్రకాశవంతమైన చంద్రుడిని ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 6.30pm తర్వాత అద్భుతంగా కనిపిస్తుంది.


