News March 26, 2025

నేను BRSలోనే ఉన్నా: గద్వాల MLA

image

తాను BRS MLAగానే ఉన్నానని గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించారు. కొంత మంది కావాలని తాను కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం చేశారని పేర్కొన్నారు. పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు నోటీసులను అనుసరించి ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. మీడియాలో వచ్చిన కథనాలపై FEB 11న PSలో ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను BRS సభ్యత్వాన్ని వదులుకోలేదని, పిటిషన్ కొట్టివేయాలని కోరారు. BRSలోనే ఉన్నానని KTRకు చెప్పానన్నారు.

Similar News

News November 9, 2025

నాగర్‌కర్నూల్: బస్సు ఆపలేదని శ్రీశైలం రహదారిపై మహిళల ధర్నా

image

నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్ చౌరస్తాలో శ్రీశైలం జాతీయ రహదారిపై మహిళలు ధర్నా చేపట్టారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం వెళ్లేందుకు గంటల తరబడి ఎదురుచూసినా ఒక్క బస్సు ఆపకపోవడంతో ఆగ్రహంతో బస్సును అడ్డగించారు. ఈ సంఘటనతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారి జోక్యంతో సమస్య సద్దుమణిగింది, అనంతరం మహిళలు తమ ప్రయాణం కొనసాగించారు.

News November 9, 2025

‘ఎలుకల దాడి’పై మంత్రి సత్యకుమార్ సీరియస్

image

AP: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ఎలుకలు కరవడంపై మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేటు ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని DME రఘునందన్‌ను ఆదేశించారు. హాస్టల్ వార్డెన్ వివరణ కోరుతూ మెమో ఇవ్వాలని కాలేజీ ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. కాగా హాస్టల్లోని పరిస్థితులపై తనిఖీ చేస్తున్నామని డీఎంఈ మంత్రికి తెలియజేశారు.

News November 9, 2025

‘ప్రజా ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరించిన కురసాల కన్నబాబు

image

విశాఖ వైసీపీ కార్యాలయంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో ఆదివారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతులు మీదుగా “ప్రజా ఉద్యమం” పోస్టర్ ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీల ప్రవేటికరణకు వ్యతిరేకంగా నవంబర్-12 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.