News March 26, 2025

నేను BRSలోనే ఉన్నా: గద్వాల MLA

image

తాను BRS MLAగానే ఉన్నానని గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించారు. కొంత మంది కావాలని తాను కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం చేశారని పేర్కొన్నారు. పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు నోటీసులను అనుసరించి ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. మీడియాలో వచ్చిన కథనాలపై FEB 11న PSలో ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను BRS సభ్యత్వాన్ని వదులుకోలేదని, పిటిషన్ కొట్టివేయాలని కోరారు. BRSలోనే ఉన్నానని KTRకు చెప్పానన్నారు.

Similar News

News September 14, 2025

యానిమల్ లవర్స్‌పై ప్రధాని మోదీ సెటైర్లు

image

ఢిల్లీలో ఇటీవల వీధి కుక్కల తరలింపును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యానిమల్ లవర్స్ ఉద్యమించిన విషయం తెలిసిందే. వారి డబుల్ స్టాండర్డ్స్‌పై ప్రధాని మోదీ రీసెంట్‌గా ఓ ఈవెంట్లో సెటైర్లు వేశారు. ‘నేను ఇటీవల కొంతమంది యానిమల్ లవర్స్‌ను కలిశాను. మన దేశంలో అలాంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వారిలో ఎక్కువ మంది ఆవులను యానిమల్‌గా పరిగణించరు’ అని వ్యాఖ్యానించారు.

News September 14, 2025

కౌరవుడే అయినా.. అన్యాయాన్ని ఎదురించాడు!

image

మహాభారతంలో ఎందరికో తెలియని పాత్రలెన్నో ఉన్నాయి. అందులో వికర్ణుడి పాత్ర ఒకటి. ఆయన కౌరవుడే అయినప్పటికీ ద్రౌపది వస్త్రాపహరణం వంటి అధర్మ కార్యాలను వ్యతిరేకించాడు. ధ్రుతరాష్ట్రుడు, ద్రోణుడు, కృపాచార్యుడు వంటి పెద్దలు నిలబడి చోద్యం చూసినా వికర్ణుడు ఊరుకోలేదు. కౌరవ అగ్రజుడైన ధుర్యోదనుడినే ఎదురించాడు. కానీ, రక్త సంబంధానికి కట్టుబడి కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన పోరాడాడు. భీముడితో తలపడి వీరమరణం పొందాడు.

News September 14, 2025

కొత్తగూడ: చంటి బిడ్డతో ఓ తల్లి నిరసన

image

కొత్తగూడ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వెజ్, కాంటిజెంట్ కార్మికులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సమ్మెలో ఒక మహిళ తన చంటి బిడ్డతో వర్షంలో గొడుగు పట్టుకుని నిరసన తెలుపుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి నిరసనలు కొనసాగుతున్నాయి.