News February 12, 2026

నేనే రాజు.. నేనే మంత్రి: రేవంత్ రెడ్డి

image

ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో TG సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి. నాకు ఎవరూ పోటీ కాదు. పదిన్నరేళ్లు సీఎంగా ఉంటాను’ అని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ లాంటి పాపపు పనులు తాను చేయనని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు అందరూ ఒకటేనని, టీఆర్ఎస్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని వ్యాఖ్యానించారు.

Similar News

News March 9, 2026

మండే ఎండలు.. ఉరుములతో వర్షాలు

image

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న దాదాపు అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలులో 38.9, కడపలో 38.8 డిగ్రీల గరిష్ఠ టెంపరేచర్ రికార్డయింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఇవాళ కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని IMD వెల్లడించింది.

News March 9, 2026

దారుణం.. బీమా డబ్బు కోసం భర్తనే చంపేసింది

image

TG: అనారోగ్యంతో ఉన్న భర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భార్య దారుణానికి పాల్పడిన ఘటన ఖమ్మంలో జరిగింది. అతడు కచ్చితంగా చనిపోతాడని రూ.66 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించింది. అయితే కొన్ని నెలలైనా మరణించకపోవడంతో డబ్బు కోసం పథకం వేసింది. భర్త రవికి మద్యం తాగించి మరో నలుగురితో కలిసి కారుతో ఢీకొట్టి చంపేసింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి భార్య ప్రశాంతి, ఇతర నిందితులను అరెస్టు చేశారు.

News March 9, 2026

ఆల్ టైమ్ రికార్డ్.. గెలుపు క్షణాలకు 82.1కోట్ల వ్యూస్!

image

వ్యూయర్‌షిప్‌లో IND-NZ మధ్య జరిగిన T20WC ఫైనల్‌ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. 19వ ఓవర్లో కివీస్ ఆఖరి వికెట్ పడేటప్పటికి జియో హాట్‌స్టార్‌లో లైవ్ వ్యూయర్‌షిప్ 75.5Crగా ఉండగా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ టైమ్‌కు 82.1Crకు చేరింది. లైవ్ స్ట్రీమ్‌లో ఒకేటైమ్‌లో నమోదైన వ్యూస్‌లో (పీక్ కాన్కరెంట్ వ్యూస్)లో ఇదే అత్యధికం. దీని తర్వాత 6.5crతో IND vs ENG సెమీస్‌, జేక్ పాల్ vs మైక్ టైసన్ మ్యాచ్ ఉన్నాయి.