News February 18, 2025
నేనొచ్చాక కూడా అధికారులు రారా..?: కలెక్టర్

ప్రజావాణిలో చాలా మంది అధికారులు తాను వచ్చిన తరువాత కూడా రావడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలుంటాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. సోమవారం ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ వచ్చిన కూడా అధికారులు రాకపోవడం సరైన విధానం కాదన్నారు. తర్వాత గ్రీవెన్స్ వచ్చిన అధికారులు వారికి సంబంధించిన అర్జీలపై కలెక్టర్‌కు వివరణ ఇచ్చారు. ఫిర్యాదు విభాగంలో 69 అర్జీలు స్వీకరించారు.
Similar News
News March 23, 2025
ఆదిలాబాద్: రేపటి నుంచి 6రోజుల పాటు శిక్షణ

ఆదిలాబాద్‌లోని TTDCలో విపత్తు నిర్వహణపై ఈ నెల 24 నుంచి 29 వరకు మర్రి చెన్నారెడ్డి ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 18 నుంచి 40 సం.రాల వయస్సు లోపు పది పాసైన 50 మందికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. టిఫిన్, భోజనం ఖర్చులకు వంద రూపాయలతో పాటు రాత్రి వసతి కూడా ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
News March 23, 2025
ADB: ఇంటివద్దకే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు

భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఆదిలాబాద్ బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి తెలిపారు. శనివారం ఆమె కౌంటర్‌ను ప్రారంభించారు. భక్తులు రూ.151 చెల్లించి బుక్ చేసుకుంటే కార్గో సేవల ద్వారా మీ ఇంటి వద్దనే తలంబ్రాలు అందజేస్తామన్నారు.
News March 23, 2025
ADB: కమాండ్ కంట్రోల్స్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ

ఆదిలాబాద్ డీఎస్పీ కార్యాలయాన్ని, కమాండ్ కంట్రోల్స్ సెంటర్‌ని ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ డివిజనల్ కార్యాలయంలో విచారణ జరుగుతున్న కేసులపై ఆయన ఆరా తీశారు. పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలన్నారు. కమాండ్ కంట్రోల్స్, సీసీ కెమెరాల తీరును పర్యవేక్షించారు. అంతకుముందు ఎస్పీకి డీఎస్పీ జీవన్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.