News November 27, 2024

నేమకల్లులో పింఛన్ పంపిణీ చేయనున్న సీఎం

image

అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పర్యటించారు. ఈ నెల 30న సీఎం చంద్రబాబు నేమకల్లు గ్రామంలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. హెలీ ప్యాడ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు.

Similar News

News December 10, 2024

అనంతపురంలో కేజీ టమాటా రూ.20

image

టమాటా ధరలు పడిపోయాయి. అనంతపురం కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న మొన్నటి వరకు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు పలుకుతుండగా తాజాగా రూ.20కి చేరింది. కనిష్ఠంగా రూ.5, సరాసరి రూ.10తో విక్రయాలు సాగుతున్నాయి. మరోవైపు చీనీ ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. నిన్న టన్ను గరిష్ఠంగా రూ.37,280 పలికాయి.

పోక్సో కేసులో నిందితుడి అరెస్టు: కదిరి సీఐ

image

కదిరి మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో నిందితుడు నాగరాజును అరెస్టు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. సీఐ వివరాల మేరకు.. నాగరాజు ఆటో నడుపుకుంటూ జీవనం గడుపుతున్నాడు. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను మభ్యపెట్టి మోసం చేశాడని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రిమాండ్‌కు పంపినట్లు వివరించారు.