News July 29, 2024

నేరడిగొండలో బోడకాకర కిలో రూ. 400

image

వర్షాకాలం సీజన్‌లో మాత్రమే దొరికే బోడ కాకరకాయ రేట్లు కొండెక్కాయి. వానా కాలంలో చికెన్, మటన్ కంటే ఔషధ గుణాలున్న బోడ కాకరకాయ తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ అని డాక్టర్‌లు చెబుతుంటారు. అటవీ ప్రాంతంలో దొరికే వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. నేరడిగొండ మండల కేంద్రంలో కిలో రూ.400 పలుకుతోంది. కేవలం రెండు నెలలు మాత్రమే దొరకడం, ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడంతో రేటు ఎక్కువైనా జనం వీటిని కొంటున్నారు.

Similar News

News February 12, 2025

ADB: EPASS SCHOLARSHIPS.. APPLY NOW

image

ADB జిల్లాలో ఇంటర్ ఆపైన చదువుతున్న పోస్ట్ మెట్రిక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి ఉపకారవేతనాలకు ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని DSCDO సునీత కుమారి తెలిపారు. రినివల్, ఫ్రెష్ పోస్ట్మెట్రిక్ విద్యార్థులు 31 మార్చి వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉపకారవేతనములు పొందేందుకు SSC మెమో, ఆధార్ కార్డులలోని పేరు ఒకేలా ఉండాలన్నారు.

News February 12, 2025

ADB: నార్నూర్‌లో రూ.2లక్షలు..ఇంద్రవెల్లిలో రూ.8లక్షలు

image

వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనలకు గురవుతున్నారు. మూడు రోజుల కిందట నార్నూర్ మండలంలోని వ్యాపారి ఇంట్లో రూ.2 లక్షలు చోరీ కాగా ఇంద్రవెల్లిలోని వెంకటి ఇంట్లో రూ.8లక్షలు చోరీ ఆయ్యాయి. కూతురు పెళ్లి కోసం రూ.8 లక్షలు జమ చేసి ఇంట్లో ఇనుప పెట్టెలు దాచానని శనివారం గుర్తు తెలియని దొంగలు దొంగతనానికి పాల్పడ్డారని వెంకటి ఆవేదన వ్యక్తం చేశారు. జరుగుతున్న చోరీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 12, 2025

ADB వాసికి అంతర్జాతీయ అవార్డు

image

అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ డిస్క్రిప్షన్ డైరెక్టర్‌గా ADBకు చెందిన ప్రముఖ సినీ డైరెక్టర్ ఫహీం సర్కార్ అవార్డు అందుకున్నారు. మంగళవారం HYDలో జరిగిన చలనచిత్ర ఉత్సవంలో భాగంగా సినిమా, టీవీ రంగాల్లో పలు విభాగాలలో అందించిన అంతర్జాతీయ అవార్డుల పురస్కారంలో భాగంగా బెస్ట్ డిస్క్రిప్షన్ డైరెక్టర్ డైరెక్టర్‌గా ఫహీం సర్కార్ అవార్డు అందుకున్నారు.

error: Content is protected !!