News April 19, 2024

నేరడిగొండలో రూ.5.17లక్షల నగదు సీజ్

image

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రోల్మండ టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఓ వాహనంలో ఇద్దరు సరైన పత్రాలు లేకుండా రూ.5.17లక్షలను తరలిస్తుండగా పట్టుపడ్డారు. దీంతో ఎస్ఐ శ్రీకాంత్ నగదును సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.

Similar News

News October 14, 2025

ADB: 2 వారాలు.. 26 మోసాలు.. మీరూ జాగ్రత్త..!

image

ఇచ్చోడ మండల కేంద్రం నుంచి ఒకరు ట్రాన్స్‌‌ఫోర్ట్ కావాలని ఆన్‌లైన్‌లో వెతకగా నకిలీ కస్టమర్ కేర్ వ్యక్తులు బాధితున్ని సంప్రదించారు. ఆదిలాబాద్ రూరల్ మండలానికి చెందిన ఒక వ్యక్తికి కేరళ లాటరీ రూ.5 లక్షలు వచ్చిందంటూ సైబరాసురులు మోసాలకు పాల్పడ్డారు. జిల్లాలో 2వారాల వ్యవధిలో 26మోసాలు జరిగాయంటే అమాయకులు ఎలా మోసపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

News October 14, 2025

ఆదిలాబాద్: నైపుణ్యంతో న్యాక్ సర్టిఫికెట్స్

image

పనిలో వృత్తి నైపుణ్యం కలిగిన సర్టిఫికెట్ లేని అభ్యర్థులకు న్యాక్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో రెండు బ్యాచ్‌లకు ఒక రోజు RPL ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా నైపుణ్యాన్ని పరీక్షించి సర్టిఫికెట్లు అందించనున్నట్లు ట్రైనింగ్ కోఆర్డినేటర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. సర్టిఫికెట్ పొందుటకు శిక్షణ రుసుం రూ.1,200 చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 9154548063 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

News October 13, 2025

ఆదిలాబాద్‌లో బంగారు ధర రికార్డు

image

ఆదిలాబాద్ పట్టణ వెండి, బంగారు వర్తక సంఘం ధరలు ప్రకటించింది. 24 కారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రికార్డు స్థాయిలో రూ.1,30,500 గా నమోదైంది. అదేవిధంగా వెండి 10 గ్రాములకు రూ.1,850గా ఉంది. ఈ కొత్త ధరలు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. బంగారం ధరల్లో పెరుగుదల కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోంది.