News April 27, 2024
నేరడిగొండ: వైన్స్‌లో అర్ధరాత్రి దొంగతనం

నేరడిగొండ మండలంలోని వరుణ్ లిక్కర్ మార్ట్‌లో అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు షట్టర్ పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. రూ.27,800 నగదు రూ. 4700 విలువచేసే మద్యం బాటిళ్లతో ఉడాయించారు. చోరీ విషయాన్ని గుర్తించిన వైన్స్ యజమానులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI శ్రీకాంత్ తెలిపారు.
Similar News
News April 24, 2025
ADB: మూడు రోజుల పాటు RED ALERT

ఉమ్మడి ADB జిల్లాలో ఏప్రిల్ చివరి వారంలోనే సుమారు 40 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజులపాటు తీవ్ర వడగాలులతో పాటు ఉక్కపోత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ADB, NRML, MNCL, ASF జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. మేలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండండి.
News April 24, 2025
ADB: వడ్డీ వ్యాపారులపై కొరడా జులిపిస్తున్న ఎస్పీ

జనాల రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన కొరడా జలపిస్తున్నారు. ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్, మావల, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ ప్రాంతాలలో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 6 మండలాలలో 30 బృందాలతో ఆకస్మిక దాడులు చేశారు. అధిక వడ్డీ వసూలు చేసే వడ్డీ వ్యాపారులపై జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 కేసుల నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 23, 2025
MNCL: జిల్లాలో విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లక్షెట్టిపేటలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని సుస్మిత (16) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది ఉరేసుకుందన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.