News March 3, 2025

నేరడిగొండ: WOW.. ఇక్కడి ఆడపడుచులు GREAT

image

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం మంగల్ మోట (తర్నం) గ్రామానికి చెందిన ఆడపడుచులు పేదింటి యువతి పెళ్లికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. ఆదివాసీ గ్రామాల్లో కట్న కానుకలను నిషేధిస్తూ ఆదివాసీలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి కట్న కానుకలు లేకపోవటంతో గ్రామంలో 60 కుటుంబాల ఆడపడుచులు కలిసి వారికి తోచినంత పొదుపు చేసుకొని రూ.12,342 ఆర్థిక సాయాన్ని అందజేశారు.

Similar News

News November 24, 2025

పార్వతీపురం: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

పార్వతీపురం మన్యం జిల్లాలో వీరఘట్టం, గుమ్మలక్ష్మీపురం, బలిజిపేట, పార్వతీపురం, గరుగుబిల్లి మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఇక్కడ<> క్లిక్ <<>>చేసి వివరాలు నమోదు చేయండి.

News November 24, 2025

టమాటా కేజీ రూ.80!

image

TG: నిన్న, మొన్నటి వరకు కేజీ రూ.20-40కే లభించిన టమాటా ఇప్పుడు కొండెక్కింది. ప్రస్తుతం కిలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో మార్కెట్లలో టమాట రేటు చూసి సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. కొన్ని మార్కెట్లలో అయితే టమాటానే దొరకడం లేదు. ధర వెచ్చించలేక వ్యాపారులు కొనుగోలు చేయడంలేదు. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో టమాట పంటలు తీవ్రంగా దెబ్బ తినడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు.

News November 24, 2025

GNT: నేడు వంగర వెంకట సుబ్బయ్య జయంతి

image

తెలుగు సినిమా, నాటక రంగాలలో ప్రసిద్ధి చెందిన హాస్యనటుడు వంగర వెంకట సుబ్బయ్య జయంతి నేడు. ఆయన 1897, నవంబర్ 24న సంగం జాగర్లమూడిలో జన్మించారు. రంగస్థల ప్రస్థానంలో తెనాలిలో స్థిరపడి, ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకంలో వసంతకుడి వేషంతో కళాహృదయుల మన్ననలు అందుకున్నారు. ఆయన దాదాపు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. ‘పెద్దమనుషులు’, ‘కన్యాశుల్కం’, ‘మాయాబజార్’ వంటి చిత్రాలలో తన హాస్యంతో ప్రేక్షకులను అలరించారు.