News January 25, 2025

నేరస్థులకు శిక్షపడే విధంగా పనిచేయాలి: రామగుండం CP

image

ఇన్వెస్టిగేషన్‌ను పూర్తి ఆధారాలతో చేసి నేరస్తులకు శిక్ష పడే విధంగా పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. కమిషనరేట్ ఆవరణలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టేషన్ల వారీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో CC కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడూ క్లియర్ చేసుకోవాలన్నారు.

Similar News

News October 16, 2025

WGL: హెల్మెట్ ధరించడం నియమం కాదు.. జీవన రక్షణ!

image

హెల్మెట్ ధరించడం కేవలం రూల్స్ పాటించడం కాదు, జీవాన్ని విలువైనదిగా భావించే బాధ్యతగా చూడాలని వరంగల్ పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి రైడ్‌లో జాగ్రత్తగా, సమర్థంగా వ్యవహరించడం ద్వారా మనతో పాటు మన కుటుంబ సభ్యుల భద్రతను కాపాడుకోవచ్చన్నారు. ప్రతి బైక్ రైడ్‌కు ముందు హెల్మెట్ ధరించడం మన జీవితాన్ని సురక్షితంగా ఉంచే మొదటి అడుగని వారు సూచించారు.

News October 16, 2025

MHBD: పత్తి రైతుకు తిప్పలు తప్పవా..!

image

పత్తిని అమ్ముకోవాలంటే రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేయడంతో పత్తి రైతుకు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు లేని, చదువు రాని రైతులకు ఈయాప్ వాడటం కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు యాప్‌పై అవగాహన సదస్సులను నిర్వహించాలని,అకాల వర్షాలకు భారీగా పత్తి పంటలు దెబ్బతిన్నాయని, పండిన కొద్దిపాటి పత్తిని అమ్ముకోవడానికి రైతులకు ఇబ్బందిగా మారింది.

News October 16, 2025

మెదక్: 49 మద్యం దుకాణాలు.. 276 దరఖాస్తులు

image

మెదక్ జిల్లాలోని మొత్తం 49 మద్యం దుకాణాలకు బుధవారం వరకు 276 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి జి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మద్యం దుకాణాలు ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు రిజర్వేషన్ కేటాయించినట్లు తెలిపారు. సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.