News January 25, 2025
నేరస్థులకు శిక్షపడే విధంగా పనిచేయాలి: రామగుండం CP

ఇన్వెస్టిగేషన్‌ను పూర్తి ఆధారాలతో చేసి నేరస్తులకు శిక్ష పడే విధంగా పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. కమిషనరేట్ ఆవరణలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టేషన్ల వారీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో CC కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడూ క్లియర్ చేసుకోవాలన్నారు.
Similar News
News February 20, 2025
‘శంభాజీ’పై నటి వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్

‘ఛావా’లో శంభాజీని ఔరంగజేబు చిత్రహింసలు పెట్టిన సన్నివేశం చరిత్రలో జరగలేదంటూ నటి స్వరభాస్కర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలంటూ ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర చదువుకున్నాను. సినిమాలో చూపించిన హింసలో ఏమాత్రం కల్పితం లేదు’ అని ఒకరు పేర్కొనగా.. ‘శంభాజీ త్యాగాన్ని చులకన చేయడానికి నీకెంత ధైర్యం’ అంటూ మరో నెటిజన్ ప్రశ్నించారు.
News February 20, 2025
మండలానికో నమూనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం:కలెక్టర్

ఖమ్మం : ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మండలానికో నమూనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం తరుణిహాట్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో ఇందిరమ్మ ఇండ్ల నమూనా ఇల్లు నిర్మించే స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
News February 20, 2025
మహా కుంభమేళాను వాడుతున్న సినీ మేకర్స్

మహా కుంభమేళా సినీజనానికి మంచి అవకాశంగా మారింది. ఇప్పటికే బాలయ్య ‘అఖండ-2’కి కొంత షూటింగ్‌ను కుంభమేళాలో తీసినట్లు సమాచారం. తాజాగా తమన్నా నాగ సాధువుగా నటిస్తున్న ‘ఓదెల-2’ ప్రమోషన్లకి కూడా కుంభమేళా వేదికగా మారింది. మూవీ టీజర్‌ను ఈ నెల 22న అక్కడే లాంఛ్ చేయనున్నట్లు వారు ఇప్పటికే ప్రకటించారు. దీంతో అటు భక్తితో పాటు ఇటు సినిమా పనిని కూడా మూవీ టీమ్స్ చక్కదిద్దుకుంటున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.