News March 10, 2025
నేరాలను అదుపు చేసేందుకు సీరియల్ నంబర్లు: పార్వతీపురం SP

నేరాలను అదుపు చేసేందుకు పట్టణంలో ఒకే ఆటో ఒకే సంఖ్య విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఎస్. వి మాధవరెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆటో యూనియన్లు ఎన్ని ఆటోలు ఉన్నాయి, యూనియన్లు, డ్రైవర్లు, ఆటోలకు సంబంధించిన రికార్డులన్నీ సమీప పోలీస్ స్టేషన్లలో నమోదు చేయించిన తెలిపారు. దీనివల్ల పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ఆటోల వారు చేసే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించవచ్చు అన్నారు.
Similar News
News February 26, 2026
పులివెందుల సీఐ ఇంట్లో భారీగా నగదు

ఏసీబీ దాడుల్లో దొరికిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఇందులో రూ. 6 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం, 54 విదేశీయ మద్యం బాటిల్లు, విలువైన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం నగదు సీఐ రెండో భార్య ఇంట్లో గుర్తించారు. ఇందులో డీఎస్పీ మురళీ నాయక్ ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
News February 26, 2026
నల్గొండ: మద్యపాన నిషేధ అమలుకు తీర్మానం

నార్కట్‌పల్లి మండలం షాపల్లి, అమ్మనబోలు గ్రామాలు బెల్ట్ షాపులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. షాపల్లిలో ఈ నెల 26 నుంచి, అమ్మనబోలులో మార్చి 1 నుంచి బెల్టు దుకాణాల నిర్వహణపై కఠిన చర్యలు చేపడతామని పాలకమండలి తీర్మానం చేసింది. గ్రామస్థుల ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇతర పల్లెలు స్వాగతిస్తున్నాయి. ఈ సామాజిక మార్పు ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News February 26, 2026
సిద్దిపేట: లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్‌గా అబ్దుల్ హమీద్

సిద్దిపేట అడిషనల్ కలెక్టర్‌గా (లోకల్ బాడీస్) అబ్దుల్ హమీద్ నియామకమయ్యారు. సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా పని చేస్తున్న ఆయన ఇటీవల ఐఏఎస్‌గా ప్రమోషన్ పొందారు. ఈ సందర్భంగా ఆయనను ప్రభుత్వం ట్రాన్సఫర్ చేస్తూ సిద్దిపేటలోనే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


