News March 10, 2025

నేరాలను అదుపు చేసేందుకు సీరియల్ నంబర్లు: పార్వతీపురం SP

image

నేరాలను అదుపు చేసేందుకు పట్టణంలో ఒకే ఆటో ఒకే సంఖ్య విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఎస్. వి మాధవరెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆటో యూనియన్లు ఎన్ని ఆటోలు ఉన్నాయి, యూనియన్లు, డ్రైవర్లు, ఆటోలకు సంబంధించిన రికార్డులన్నీ సమీప పోలీస్ స్టేషన్లలో నమోదు చేయించిన తెలిపారు. దీనివల్ల పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ఆటోల వారు చేసే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించవచ్చు అన్నారు.

Similar News

News February 16, 2026

HYD: నిరుద్యోగులకు GOOD NEWS

image

HYDలోని కేంద్రీయ విద్యాలయ 2026-27 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు ఈనెల 19న ఉదయం 8 గంటల నుంచి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతతో పాటు (CTET) అర్హత కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News February 16, 2026

ఖమ్మం: నేడే ఎంపిక.. తీవ్ర ఉత్కంఠ..!

image

ఉమ్మడి ఖమ్మంలోని 7 మున్సిపాలిటీలకు ఛైర్మన్‌లు ఎవరనేది మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది. పదవులపై ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధికార పార్టీ ఎంపిక విధానంపై అంతర్గతంగా చర్చలు జరిగినట్లు సమాచారం. స్థానిక సామాజిక సమీకరణాలు, నాయకత్వానికి సమీపత వంటి అంశాలు కీలకంగా మారినట్లు తెలుస్తోంది. అధిష్టానం తుది నిర్ణయం మేరకే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు ఖరారుకానున్నాయి. కొత్తగూడెం మేయర్ ఖరారైన విషయం తెలిసిందే.

News February 16, 2026

నెల్లూరు: అడవిలో తప్పిపోయిన 12 మంది భక్తులు సేఫ్

image

రాపూరు (M) పంగిలి గ్రామ సమీపంలోని మామిడికొనలో ఉన్న వెలసిన శ్రీ మల్లయ్యస్వామి వారి దర్శనార్థం నెల్లూరు సిటీ అయ్యప్ప గుడి పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది టెంపోలో వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో పంగిలి గ్రామానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో చీకటి కారణంగా 12 మంది దారి తప్పిపోయారు. పోలీసులు గాలించి వారిని బంధువులకు అప్పగించారు.