News December 29, 2024
నేరాలు పెరిగాయి: NLG ఎస్పీ
నల్గొండ జిల్లాలో గడిచిన ఏడాది నేరాలు పెరగ్గా, రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు. మహిళలపైన లైంగిక దాడులు, హత్యలు ఎక్కువగానే జరిగాయన్నారు. దోపిడీలు, దొంగతనాలు కూడా గతేడాదితో పోల్చితే పెరిగాయని తెలిపారు. 2024లో జిల్లాలో 33 హత్యలు, 100 లైంగిక దాడులు, 657 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. నల్గొండను నేర రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Similar News
News January 6, 2025
ALERT.. NLG: మాంజాతో గొంతులు తెగుతున్నాయ్!
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. గత ఏడాది రామగిరికి చెందిన ఓ యువకుడికి మాంజా తగిలి చేతికి గాయమైన విషయం తెలిసిందే.
News January 6, 2025
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ
సైబర్ నేరాల పై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో పలు యాప్లు డౌన్లోడ్ చేయించి ప్రలోభ పెట్టి ప్రజల బ్యాంకు ఖాతా నుంచి నగదు దోచుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి ఘటన నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందన్నారు. ఈ కేసులో సైబర్ నేరగాళ్లు ఓ బాధితుడికి సుమారు 2కోట్లను మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయించి మోసం చేశారన్నారు.
News January 5, 2025
నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కోమటిరెడ్డి
గర్భస్థ, శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న తాత్కాలిక ఏఎన్సీ భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తాత్కాలిక భవన పనుల నిర్మాణానికి ఆదివారం పూజ చేశారు.