News February 6, 2025
నేరాల నియంత్రణకు రాత్రి వేళల్లో ముమ్మర గస్తీ: వరంగల్ సీపీ

నేరాలను నియంత్రణకు రాత్రి సమయాల్లో పోలీసులు ముమ్మరంగా పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. ప్రధానంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్‌తో అనుమానిత వ్యక్తులు, వాహనాలు తనిఖీ చేయాలని సూచించారు. తద్వారా ప్రజలకు పోలీసులపై నమ్మకం, నేరస్థులకు భయం కలుగుతుందని పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
శ్రీకాకుళం: దైవ దర్శనాలకు వెళ్తూ మృత్యుఒడిలోకి..!

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు వ్యాన్‌లో దైవ దర్శనాలకు వెళ్తూ <<18364371>>మృత్యుఒడిలోకి<<>> చేరుకున్నారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. అయోధ్య, కాశీ, పూరీ వంటి క్షేత్రాలు దర్శించుకున్న అనంతరం శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో గాయపడ్డ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.
News November 23, 2025
వనపర్తి: లక్ష్యానికి దూరంగా పన్నుల వసూళ్లు

గృహ, వ్యాపార సముదాయాల నుంచి వసూలు చేసే పన్నుల విషయంలో పురపాలక శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. పట్టణంలో పలువురు పన్నులు సవరించాలని పురపాలికకు దరఖాస్తు చేసుకున్నా.. పట్టించుకోవడం లేదు. 2021 నుంచి 2026 వరకు 18,500 గృహ, వ్యాపార సముదాయాల నుంచి రూ.12.53 కోట్ల పన్నులు వసూలు చేయాల్సింది ఉండగా.. కేవలం రూ.2.60 కోట్ల పన్నులు మాత్రమే వసూలు చేశారు.
News November 23, 2025
KNR: సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నిషియన్‌లో ఉచిత శిక్షణ

క్రాష్ ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుకు నిరుద్యోగ క్రైస్తవ మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టి సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నిషియన్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తుతో పాటు అభ్యర్థి ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్లును DEC 10 లోపు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలి.


