News January 27, 2025
నేరాల నియంత్రణకై ముమ్మర పెట్రోలింగ్ చేపట్టాలి: సెంట్రల్ జోన్ డీసీపీ

సెంట్రల్ జోన్ నేరాల నియంత్రించేందుకు పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది ముమ్మరంగా పెట్రోలింగ్ చేపట్టాలని సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా అధికారులకు సూచించారు. సెంట్రల్ జోన్‌కు చెందిన పోలీస్ అధికారులతో సెంట్రల్ జోన్ డీసీపీ నేర సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా పెండింగ్ కేసులను పరిష్కరించడంలో అధికారులు చొరవ తీసుకోవాలని భాదితులకు న్యాయం చేయాలని డీసీపీ అధికారులకు తెలిపారు.
Similar News
News November 21, 2025
సిరిసిల్ల: ‘పిల్లలకు ఆరునెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి’

సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో NATIONAL NEW BORN WEEK అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. నవజాత శిశువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ వివరించారు. ఆరు నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇప్పించాలని సూచించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్, వైద్యులు పాల్గొన్నారు.
News November 21, 2025
సీఎం మార్పు ప్రచారంపై డీకే శివకుమార్ క్లారిటీ

కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారానికి Dy.CM డీకే శివకుమార్ తెరదించారు. అలాంటి మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్య ఐదేళ్లు పూర్తిగా పనిచేస్తారని, అందుకు తానూ సహకరిస్తానన్నారు. తామిద్దరం హైకమాండ్ ఆదేశాలను పాటిస్తామన్నారు. ‘అందరికీ మంత్రిపదవి అవకాశం రావాలని సీఎం యోచిస్తున్నారు. అందుకే క్యాబినెట్‌లో మార్పులు చేయాలనుకుంటున్నారు. ఈక్రమంలోనే పార్టీ MLAలు ఢిల్లీకి వచ్చారు’ అని తెలిపారు.
News November 21, 2025
పాడేరు: వినతులు స్వీకరించిన కలెక్టర్ దినేష్

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఎ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ వినతులను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఆర్డీఓ లోకేశ్వరరావు పాల్గొన్నారు.


