News February 12, 2025
నేరాల నియంత్రణకై ముమ్మర పెట్రోలింగ్ చేపట్టాలి: మామునూర్ ఏసీపీ

మామూనూర్ డివిజన్ పరిధిలో నేరాలు నియంత్రించేందుకు పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది ముమ్మరంగా పెట్రోలింగ్ చేపట్టాలని ఏసీపీ తిరుపతి అధికారులకు సూచించారు. డివిజన్‌కు చెందిన పోలీస్ అధికారులతో మామూనూర్ ఏసీపీ నేర సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా పెండింగ్ కేసులను పరిష్కరించడంలో అధికారులు చొరవ తీసుకోవాలని భాదితులకు న్యాయం చేయాలని ఏసీపీ అధికారులకు తెలిపారు.
Similar News
News December 10, 2025
బుమ్రా 100వ వికెట్‌పై SMలో చర్చ!

SAపై తొలి T20లో బ్రెవిస్ వికెట్ తీసిన బుమ్రా 3 ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వికెట్‌పై SMలో చర్చ నడుస్తోంది. బుమ్రా నో బాల్ వేశారని, థర్డ్ అంపైర్ కూడా సరైన నిర్ణయం ఇవ్వలేదని కొందరు అంటున్నారు. అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్లో నిర్ణయం బౌలర్‌కు అనుకూలంగా ఉంటుందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ అది గుడ్ బాలా? నో బాలా? COMMENT.
News December 10, 2025
డిసెంబర్ 10: చరిత్రలో ఈ రోజు

1878: స్వాతంత్ర్య సమరయోధుడు, భారత గవర్నర్ సి.రాజగోపాలచారి(ఫొటోలో) జననం
1896: డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం
1952: సినీ నటి సుజాత జననం
1955: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన రోజు
1985: సినీ నటి కామ్నా జఠ్మలానీ జననం
– అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
News December 10, 2025
వరంగల్: చలికాలంలో స్థానిక ఎన్నికల హీట్!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో స్థానిక రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. వార్డుల్లో అలకలు, అసంతృప్తులు వ్యక్తమవుతుండగా, కొత్త చేరికలు, తిరుగుబాటు నేతలను బుజ్జగించే ప్రయత్నాలతో పార్టీ కార్యాలయాలు బిజీగా మారాయి. అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమీకరణాలు, వర్గపోరు కలిసి ఈ చలికాలంలో ఎన్నికల హీట్‌ను పెంచుతున్నాయి.


