News August 26, 2024
నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: ఎస్పీ
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ అన్నారు. నేడు మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడలో 40 సీసీ కెమెరాలను స్థానిక ప్రజలతో కలసి ఎస్పీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన అన్నారు.
Similar News
News September 17, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,53,203 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.78,346, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.50,200, అన్నదానం రూ.24,657,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
News September 16, 2024
ఉమ్మడి కరీంనగర్‌లో పట్టాలెక్కిన ‘వందేభారత్’
నాగపూర్- సికింద్రాబాద్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎట్టకేలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందేభారత్ ట్రైన్ పట్టాలెక్కింది. ఈ ట్రైన్ రామగుండం నుంచి సికింద్రాబాద్‌కు కేవలం 3 గంటల్లో చేరుకుంటుదని అధికారులు తెలిపారు. మంగళవారం మినహా మిగతా రోజుల్లో ఈ సర్వీస్ నడవనుంది. అయితే సికింద్రాబాద్ నుంచి రామగుండం వరకు ఏసీ చైర్‌కార్‌లో రూ.865 కాగా ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌లో రూ.1,510గా ధర నిర్ణయించారు.
News September 16, 2024
కరీంనగర్: రూ.5 లక్షల బీమాపై వృద్ధుల హర్షం
70 ఏళ్లు పైబడిన వారికి వైద్యం కోసం రూ.5 లక్షల ప్రత్యేక బీమా కల్పిస్తామని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని వృద్ధులు కేంద్రం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉన్నప్పటికీ ఈ బీమా వర్తించనుంది. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల పరిధిలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులు రూ.2 లక్షల మందికిపైగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.