News July 4, 2024
నేరేడుచర్ల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తా: మంత్రి ఉత్తమ్

నేరేడుచర్ల అభివృద్దే లక్ష్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలసి పనిచేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్ల మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ బి.ప్రకాష్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందని ఆదిశగా పనిచేయాలని సూచించారు.
Similar News
News November 23, 2025
జీఎన్ఎం శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు

నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైపరీ) శిక్షణ సంస్థల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 3 సంవత్సరాల శిక్షణకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గల వారు పూర్తి వివరాలు ఆన్లైన్ వెబ్ సైట్ dme.tealngana.gov.inలో చూసుకోవచ్చని సూచించారు.
News November 23, 2025
నల్గొండ: పున్నా కైలాస్ నేత రాజకీయ నేపథ్యం

మునుగోడుకు చెందిన పున్నా కైలాస్ నేత ఓయూలో చదువుకునే సమయంలోనే రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఓయూ విద్యార్థి నేతగా.. విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్లో చేరి 2018, 2023లో మునుగోడు MLA టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. 2022 నుంచి TPCC ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
News November 22, 2025
BREAKING: నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాష్

డీసీసీ అధ్యక్షులను ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అదిష్ఠానం ప్రకటించింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పున్న కైలాష్ నేతను నియమించింది. నల్గొండ డీసీసీకి పలువురు పోటీ పడినప్పటికీ మునుగోడుకు చెందిన పున్న కైలాష్ నేతనే డీసీసీ పదవి వరించింది.


