News July 4, 2024

నేరేడుచర్ల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తా: మంత్రి ఉత్తమ్

image

నేరేడుచర్ల అభివృద్దే లక్ష్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలసి పనిచేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్ల మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ బి.ప్రకాష్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందని ఆదిశగా పనిచేయాలని సూచించారు.

Similar News

News October 13, 2024

మొదటి స్థానంలో నిలిచిన దేవరకొండ ఆర్టీసీ డిపో

image

దేవరకొండ ఆర్టీసీ డిపో నుంచి నడిపిన బస్సుల ద్వారా ఈనెల 11న ఒక్కరోజే దేవరకొండ డిపో రూ.35.86 లక్షలు ఆర్జించి, ఓఆర్‌లో 118.90 తో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించినట్లు డిపో మేనేజర్ తల్లాడ రమేష్ బాబు ఆదివారం తెలిపారు. మొత్తంగా 46 వేల 755 కిలోమీటర్లు నడిపి 51,750 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిపో ఉద్యోగులకు డీఎం అభినందనలు తెలిపారు.

News October 13, 2024

తుంగతుర్తి: వేలంపాటలో దుర్గామాత చీరను దక్కించుకున్న ముస్లింలు

image

తుంగతుర్తి మండలం అన్నారు గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన దుర్గమ్మ తల్లి చీర వేలం పాటలో ముస్లిం సోదరులు చీరను దక్కించుకున్నారు. ఈ మేరకు ఎండి.సిద్ధిక్ భాష, ఆజం అలీ పాల్గొని చీరను రూ.4100లకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో చాలామంది పోటీపడి వేలం హోరాహోరీగా సాగింది. ఈ సంఘటన కులమత సామరస్యతకు ప్రత్యేకంగా నిలవడంతో పలువురి ప్రశంసలు అందుకున్నారు.

News October 13, 2024

NLG: పత్తి రైతుకు దక్కని మద్దతు ధర

image

నల్గొండ జిల్లాలో పత్తి పంట పండిస్తున్న రైతులు దళారుల చేతిలో దగా పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి కనీస ధర కూడా లభించకపోవడంతో దళారుల ఊబిలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం మద్దతు ధర క్వింటాకు రూ.7,521 ఉండగా వ్యాపారులు రూ.6300 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి రైతుల చేతికి వచ్చినా ఇంకా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని తెలిపారు.