News May 22, 2024
నేర నియంత్రణే లక్ష్యంగా కార్డెన్ & సెర్చ్: డీజీపీ

నేర నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్డెన్ & సెర్చ్ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు 301 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. ఎటువంటి పత్రాలు లేని 1104 వాహనాలు జప్తు చేసి, 482 లీటర్ల ఐడీ లిక్కర్, 33.32 లీటర్ల మద్యం, 436 లీటర్ల నాన్ డ్యూటీ లిక్కర్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
మంగళగిరి: ఆ అధికారి ఆఫీసుకు వచ్చి ఏడాది దాటింది!

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (మంగళగిరి) కార్యాలయం సబార్డినేటర్ మహ్మద్ ఫజల్-ఉర్-రహమాన్ విధులకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో సహాయ సంచాలకులు సీరియస్ అయ్యారు. గతేడాది జూన్ నుంచి నేటి వరకు ఎటువంటి అనుమతి లేకున్నప్పటికీ విధులకు హాజరు కావడం లేదని చెప్పారు. ఇప్పటి వరకు 3 సార్లు నోటీసులు జారీచేసినప్పటికీ స్పందించలేదన్నారు. 15 రోజుల లోపులిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని, లేకుంటే సర్వీస్ నుంచి తొలగిస్తామన్నారు.
News December 13, 2025
నేడు తుళ్లూరులో ఎంపీ పెమ్మసాని పర్యటన

తుళ్లూరు మండలంలో శనివారం కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలో అమరావతి అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తుళ్లూరులోని మేరీమాత స్కూల్లో “నయీ చేతన” కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.
News December 12, 2025
కాకుమాను: సివిల్ సప్లైస్ డైరెక్టర్‌గా నక్కల ఆగస్టీన్

కాకుమాను మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత నక్కల ఆగస్టీన్‌ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు ఆగస్టీన్ ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టీన్ నియామకంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.


