News February 14, 2025
నేలకొండపల్లి: అప్పుల బాధతో రైతు బలవన్మరణం

అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని మంగాపురం తండాలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తేజావత్ రామ(50) తనకున్న నాలుగు ఎకరాలకు తోడు మరికొంత కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంట పెట్టుబడికి అప్పు చేశాడు.. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో, అప్పు తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు.
Similar News
News October 14, 2025
చేగుంట: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు స్వాతి

చేగుంట మండల పరిధిలోని చందాయపెట్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కే. స్వాతి రాష్ట్ర స్థాయి కబడ్డీ అండర్ 14 పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ శంకర్ చారి తెలిపారు. స్వాతి ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయుడు శ్రీ కిషన్, ఉపాధ్యాయుల బృందం హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాఠశాల, విద్యార్థులు ఆమెను సత్కరించారు.
News October 14, 2025
ఎచ్చెర్ల: ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 42 శాతం ప్రవేశాలు’

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్ -2025 రెండో విడత కౌన్సిలింగ్ అలాట్మెంట్లను కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విద్యాలయంలో 19 పీజీ కోర్సుల్లో 600 సీట్లు ఉండగా 253 ప్రవేశాలు జరిగాయన్నారు. 42% ప్రవేశాలు మాత్రమే జరిగాయి. కనీసం పీజీ కోర్సులో 50% ప్రవేశాలు జరగకపోవటం గమనార్హం. కొన్ని కోర్సుల్లో కనీస ప్రవేశాలు జరగలేదు.
News October 14, 2025
సంగారెడ్డి: NMMSకు నేడే చివరి తేదీ

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగుస్తుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులు https://bse.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు ₹1000 చొప్పున నాలుగు సంవత్సరాలు ఉపకార వేతనం అందిస్తారని పేర్కొన్నారు.