News September 12, 2024

నేషనల్ కిక్ బాక్సింగ్‌లో కోటకొండ బిడ్డకు గోల్డ్ మెడల్

image

నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన గొల్ల అజయ్ క్రీడల్లో సత్తా చాటాడు. జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించారు. అజయ్ నిరుపేద కుటుంబానికి చెందిన బిడ్డ కాగా.. తండ్రి దస్తప్ప వ్యవసాయంతో పాటు గొర్రెల కాపరిగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న అజయ్.. చదువుతోపాటు ఇష్టమైన కిక్ బాక్సింగ్‌లో మెడల్ సాధించి ఔరా అనిపించాడు.
-CONGRATS

Similar News

News July 7, 2025

MBNR: HCA 2డే లీగ్.. మొదటి రోజు మనదే

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి B- డివిజన్ 2డే లీగ్ టోర్నీలో ఉమ్మడి పాలమూరు జిల్లా జట్టు మొదటి రోజు సత్తాచాటింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 68.1 ఓవర్లలో 243/10 పరుగులు చేసింది. అనంతరం రాకేష్-XI జట్టు 19.1 ఓవర్లలో 55/6 పరుగులు చేసింది. మహబూబ్ నగర్ జట్టులో శ్రీకాంత్-71, సంజయ్-69 పరుగులు చేయగా.. గగన్ 4 వికెట్లు తీశారు. మహబూబ్ నగర్ 188 పరుగుల లీడ్‌లో ఉంది.

News July 7, 2025

MBNR: గ్రీవెన్స్ డే.. 12 ఫిర్యాదులు- SP

image

బాధితులకు తక్షణ న్యాయం అందించడమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజల నుంచి మొత్తం 12 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఫోన్‌లో మాట్లాడి బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

News July 7, 2025

MBNR: ఆ ప్రాంతాల్లో 15 చిరుతల సంచారం.. ప్రజలు అప్రమత్తం

image

మహబూబ్ నగర్, మహమ్మదాబాద్ మండలాలోని అటవీ ప్రాంతాల్లో సుమారు 15 చిరుతల మేర సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. గాధిర్యాల్ లోని కొణెంగల గుట్టపై చిరుత సంచారం రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో ఫారెస్ట్ అధికారులు లావణ్య, శ్రీనివాస్, సిబ్బంది కొణెంగల గుట్టకు వెళ్లి పరిశీలించారు. కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేంజ్ అధికారి అబ్దుల్ హై పేర్కొన్నారు.